ఒకే రోజు ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ

by Mahesh |
ఒకే రోజు ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒకేసారి ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లోని రాణి కమలపాటి రైల్వే స్టేషన్ నుండి ఐదు వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో భోపాల్ (రాణి కమలాపతి)-ఇండోర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్; భోపాల్ (రాణి కమలాపతి)-జబల్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్; రాంచీ-పాట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్; ధార్వాడ్-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరియు గోవా (మడ్గావ్)-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. కాగా భారత ప్రధాని మోడీ ఇలా ఒకేరోజు ఐదు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లను ప్రారంభించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

Next Story