జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలకు నరేంద్ర మోడీ..

by DishaWebDesk |
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలకు నరేంద్ర మోడీ..
X

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 27న జపాన్‌లో పర్యటించనున్నారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం వెల్లడించారు. షింజో అబే భారత్‌తో మంచి సంబంధాలు నెలకొల్పడంలో కీలకంగా వ్యవహరించారు. ఇరు దేశాలు మధ్య సత్సంబంధాలను మెరుగుపరచడంలో తన వంతు పాత్ర పోషించారు. ముఖ్యంగా ప్రధాని మోడీతో మంచి అనుబంధాన్ని కలిగి ఉన్నారు.

మొదటి సారిగా 2006లో భారత్ పర్యటించిన అబే, ప్రధాని మోడీ హయాంలో రెండు పర్యాయాలు దేశానికి వచ్చారు. కాగా, నివేదిక ప్రకారం టోక్యోలోని నిప్పోన్ బుదోకాన్‌లో జరగనున్న అబే అంత్యక్రియలకు 6,000 మందికి పైగా రానున్నట్లు అంచనా వేస్తున్నారు. జూలై 8న ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న అబేను ఓ వ్యక్తి కాల్చి చంపిన సంగతి తెలిసిందే.

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed