వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు భారత్ సత్తాకు నిదర్శనం.. ప్రధాని మోడీ

by Dishafeatures2 |
వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు భారత్ సత్తాకు నిదర్శనం.. ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు భారత్ సత్తాకు నిదర్శనమని ప్రధాని మోడీ అన్నారు. శనివారం భోపాల్ లోని రాణి కమలపాటి రైల్వే స్టేషన్ లో భోపాల్- న్యూఢిల్లీ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీఎం మోడీ మాట్లాడుతూ.. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందించబడ్డాయని తెలిపారు. 100 శాతం ఆక్యూపెన్సీతో ఈ ట్రైన్లు నడుస్తున్నాయని అన్నారు. పరిశుభ్రత విషయంలో, సమయానికి రావడంలో ఈ రైళ్లు పేరు గాంచాయని తెలిపారు.

ప్రయాణికులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఈ ట్రైన్ లో ఉన్నాయని చెప్పారు. దేశంలో ఇప్పటికే 10 వందే భారత్ ట్రైన్లు ఉండగా ఇది పదకొండవ ట్రైన్ అని పీఎం తెలిపారు. టికెట్ల విషయంలో ఎలాంటి అవకతవకలకు ఛాన్స్ లేదని పీఎం మోడీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పీఎం మోడీతో పాటు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ , రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed