ఆన్‌లైన్ గేమర్లతో ప్రధాని మోడీ ముచ్చట్లు

by S Gopi |
ఆన్‌లైన్ గేమర్లతో ప్రధాని మోడీ ముచ్చట్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆన్‌లైన్ వీడియో గేమ్‌ల ద్వారా పాపులార్ అయిన కొంతమంది గేమర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరదాగా గడిపారు. వారితో గేమింగ్ పరిశ్రమకు సంబంధించిన అనేక సమస్యలపై మాట్లాడారని బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాలవియా గురువారం తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన గేమర్లు పాయల్ ధారి, తీర్థ్ మెహతా, అన్షు బిష్త్, నమన్ మథుర్, అనిమేష్ అగర్వాల్, మిథిలేశ్ పటాంకర్, గణేశ్ గంగాధర్ ప్రధాని నివాసానికి వెళ్లారు. వారితో పరిశ్రమ గురించి చర్చించిన మోడీ, అనంతరం వారితో కలిసి కొద్ది సమయంలో వీఆర్, పీసీ గేమ్స్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన అమిత్ మాలవియా, గేమింగ్ పరిశ్రమ జరుగుతున్న పరిణామాలు, గేమర్ల సృజనాత్మకతను మోడీ ప్రభుత్వ ఎలా గుర్తించిందో వారితో చర్చించారు. గేమింగ్స్, గ్యాంబ్లింగ్ సమస్య, ఈ రంగంలో మహిళల భాగస్వామ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వీడియోను విడుదల చేస్తామని వెల్లడించారు.Next Story

Most Viewed