Pm modi: దేశభక్తిని అణచివేసేందుకు కాంగ్రెస్ కుట్ర.. ప్రధాని మోడీ విమర్శలు

by vinod kumar |
Pm modi: దేశభక్తిని అణచివేసేందుకు కాంగ్రెస్ కుట్ర.. ప్రధాని మోడీ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కులతత్వం, మతతత్వం ద్వారా దేశభక్తిని అణచి వేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. దేశానికి ఉపయోగపడే ప్రతి అంశాన్నీ కాంగ్రెస్ చిక్కుల్లో పెట్టిందని ఫైర్ అయ్యారు. హర్యానాలోని పాల్వాల్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి, జమ్మూ కశ్మీర్‌లో రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయడానికి కాంగ్రెస్ అనుమతించలేదన్నారు. పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వేషన్లు లేకుండా చేశారని, ముస్లిం మహిళలను ట్రిపుల్ తలాక్ సమస్యలోకి నెట్టివేసిందని మండిపడ్డారు. దేశంలోని అనేక సమస్యలకు కారణం ఆ పార్టీనే అని అన్నారు.

దేశ పౌరుల సమస్యలను ఎన్నడూ పరిష్కరించలేదని తెలిపారు. తమ కుటుంబాన్ని నిర్మించుకునేందుకే శక్తినంతా ధారపోశారని చెప్పారు. కాంగ్రెస్ ఎన్నోపాపాలు చేసిందని, అవన్నీ పక్కన బెట్టి ఇప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కలలు కంటుందన్నారు. కులతత్వాన్ని ప్రచారం చేయడం ద్వారా దేశభక్తిని అణిచివేయాలని చూస్తోందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ హామీలు వాగ్దానాలకే పరిమితమయ్యాయని, కానీ బీజేపీ కష్టపడి ఫలితాలు సాధిస్తోందన్నారు. హర్యానాలో హస్తం పార్టీ పరిస్థితిని ప్రజలు గమనిస్తున్నారని ఎన్నికల్లో వారికి తగిన బుద్ది చెప్పేందుకు ఇప్పటికే సిద్ధమయ్యారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed