బైడెన్, రిషి సునాక్ పై పైచేయి.. అత్యంత ప్రజాదరణ నేత మోడీనే

by Shamantha N |
బైడెన్, రిషి సునాక్ పై పైచేయి.. అత్యంత ప్రజాదరణ నేత మోడీనే
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని మోడీ నిలిచాడు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెర్చ్ లో తేలింది. ఈ ఏడాది జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 వరకు సర్వే చేపట్టారు. దేశాధినేతలకు వారి సొంత దేశాల్లో ప్రజాదరణ గురించి సర్వే నిర్వహించారు. ఈ జాబితాలో మోడీ టాప్ ప్లేస్ లో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌.. మోడీ కంటే వెనుకబడి ఉన్నారు. మెక్సికో అధ్యక్షుడు అండ్రూస్‌ మాన్యుల్‌ లోపెజ్‌ ఒబ్రాడర్‌ రెండో స్థానంలో నిలిచారు.

మార్నింగ్ కన్సల్ట్ వెబ్ సైట్ గణాంకాల ప్రకారం.. మోడీకి భారత్ లో 78 శాతం జనాదరణ ఉన్నట్లు తెల్సింది. దేశ జనాభాలో 78 శాతం మోడీ నాయకత్వాన్ని ఆమోదించగా.. 17 శాతం మంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరో 6 శాతం మంది మోడీపై ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. మోస్ట్‌ పాపులర్‌ గ్లోబల్‌ లీడర్‌గా ఆయన తొలి స్థానంలో ఉన్నారు.

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కు 37 శాతం ఆమోదం పొందగా.. 55 శాతం వ్యతిరేకంగా ఉన్నారు. మొత్తం 8 శాతం మంది ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. యూకే ప్రధాని రిషి సునక్‌కు ప్రజల్లో ఆదరణ తగ్గింది. 25 శాతం మంది ప్రజలు సునాక్ నాయకత్వాన్ని ఆమోదించగా.. 66 శాతం మంది అతని లీడర్ షిప్ పై వ్యతిరేకంగా ఉన్నట్లు తేలింది. గతేడాది డిసెంబర్‌ నిర్వహించిన ఇదే సర్వేలో నరేంద్ర మోడీకి 76 శాతం ప్రజాదరణ లభించింది. కాగా నెల రోజుల్లో మరో 2 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed