కుప్పకూలిన ఆర్మీ చిరుత..

by Disha Web |
కుప్పకూలిన ఆర్మీ చిరుత..
X

దిశ, వెబ్‌డెస్క్: అరుణాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ చిరుత హెలికాప్టర్ కూలి.. ఓ పైలట్ మృతి చెందాడు. చైనా సరిహద్దు సమీపంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాలో భారత ఆర్మీ చిరుత హెలికాప్టర్ బుధవారం ఉదయం 10 గంటల సమయంలో కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఇద్దరు పైలట్లను సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ఓ పైలెట్ మృతి చెందగా.. మరో పైలెట్ చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని రక్షణ ప్రతినిధి కల్నల్ ఏఎస్ వాలియాను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. కాగా ఈ ఘటనకు గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed