నీట్ పీజీకి ‘జీరో కటాఫ్‌’ పై పిటిషన్‌.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

by Disha Web Desk 12 |
నీట్ పీజీకి ‘జీరో కటాఫ్‌’ పై పిటిషన్‌.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
X

న్యూఢిల్లీ : నీట్ పీజీ కౌన్సిలింగ్‌కు కటాఫ్ మార్కులను సున్నాకు తగ్గించడాన్ని సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై ప్రతిస్పందనను తెలియజేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ మెడికల్ కౌన్సెలింగ్ కమిటీలను న్యాయమూర్తి జస్టిస్ పురుషీంద్ర కుమార్ కౌరవ్ ఆదేశించారు. మార్చి 5న నీట్‌ పీజీ పరీక్షకు హాజరై కౌన్సెలింగ్‌ ప్రక్రియలో పాల్గొన్న ముగ్గురు ఎంబీబీఎస్‌ వైద్య విద్యార్థులు ఈ పిటిషన్‌ ను దాఖలు చేశారు. ‘‘అర్హత ప్రమాణాలను సున్నా శాతానికి కేంద్రం తగ్గించడం ద్వారా.. నీట్ పీజీ పరీక్షను నిర్వహించడం యొక్క ఉద్దేశం నీరుగారిపోయింది’’ అని పిటిషనర్ల తరఫున న్యాయవాది తన్వీ దూబే కోర్టులో వాదన వినిపించారు.

Next Story