రాజ్యాంగం ఇచ్చిన హక్కు ద్వారానే మాట్లాడాను: ఉదయనిధి స్టాలిన్!

by Disha Web Desk 6 |
రాజ్యాంగం ఇచ్చిన హక్కు ద్వారానే మాట్లాడాను: ఉదయనిధి స్టాలిన్!
X

చెన్నై: సిద్ధాంతపరమైన విభేదాల కారణంతోనే తనపై పిటిషన్ దాఖలు చేశారని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మద్రాస్ హైకోర్టుకు తెలిపారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఉదయనిధికి మంత్రి పదవిలో కొనసాగేందుకు అర్హత లేదని దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఉదయనిధి తరపున సీనియర్ న్యాయవాది పి విల్సన్ మాట్లాడుతూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, మతాన్ని ఆచరించే, ప్రచారం చేసే హక్కుకు హామీ ఇస్తుంది. అలాగే నాస్తికత్వాన్ని ఆచరించే, ప్రచారం చేసే హక్కును ప్రజలకు ఇస్తుంది. ఆర్టికల్ 19(1)(ఏ) స్వేచ్ఛ లేదా భావవ్యక్తీకరణతో ఆర్టికల్ 25 మంత్రి ప్రసంగం తప్పు కాదని సూచిస్తుందని విల్సన్ జస్టిస్ అనితా సుమంత్ ముందు వాదించారు.

గత నెల ఓ కార్యక్రమంలో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను సవాల్ చేస్తూ హిందూ మున్నాని సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. డీఎంకె సిద్ధాంతం హిందూ మున్నానికి పూర్తి భిన్నంగా ఉంటుందని, ద్రవిడ సిద్ధాంతానికి కట్టుబడి ఉండే డీఎంకె నాయకులు ఆత్మగౌరవం, సమానత్వం, సోధర భావం, హేతువాద ఆలోచనలతో మాట్లాడతారని విల్సన్ అన్నారు. అయితే, వైరీ పక్షం మాత్రం కుల ప్రాతిపదికన సమాజానాన్ని చీలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఉదయనిధి వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపించబడిన కార్యక్రమ ఆహ్వాన పత్రం, సమావేశానికి హాజరైన వారి జాబితాను సమర్పించాల్సిందిగా పిటిషనర్లను కోరిన తర్వాత న్యాయమూర్తి తదుపరి విచారణను అక్టోబర్ 31న వాయిదా వేశారు.


Next Story

Most Viewed