కశ్మీర్‌లో ఇద్దరు మాజీ సీఎంల ఓటమి

by Hajipasha |
కశ్మీర్‌లో ఇద్దరు మాజీ సీఎంల ఓటమి
X

దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానంలో అనూహ్య ఫలితం వచ్చింది. ఇక్కడి నుంచి పోటీచేసిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఓటమి పాలయ్యారు. కడపటి సమాచారం అందేసమయానికి ఈ స్థానంలో నేషనల్ కాన్ఫరెన్స్ నేత మియాన్ అల్తాఫ్ అహ్మద్ 2.3 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. దీంతో పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ వెనుకంజలో ఉండిపోయారు. ఇక గెలిచే అవకాశం కనిపించకపోవడంతో ఆమె ఓటమిని అంగీకరించారు. గెలుపు సాధించనున్న మియాన్ అల్తాఫ్ అహ్మద్‌కు అభినందనలు తెలుపుతూ ఆమె ఓ ట్వీట్ చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తనకు అండగా నిలిచిన పీడీపీ పార్టీ శ్రేణులకు మెహబూబా ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం అని ఆమె చెప్పారు. కాగా, మరో మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా బారాముల్లా నియోజకవర్గంలో ఓడిపోయారు. ఆ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి అబ్దుల్ రషీద్ షేక్‌ గెలిచారు.Next Story

Most Viewed