- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Karnataka: ప్రైవేటు రిహాబిలిటేషన్ సెంటర్ లో దారుణం

దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరులోని ఓ ప్రైవేటు రిహాబిలిటేషన్ (rehabilitation centre) సెంటర్‌లో దారుణం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఓ రోగిపై ఇద్దరు వ్యక్తులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో, పలువురు ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర వ్యక్తం చేస్తున్నారు. రిహాబిలిటేషన్ లో ఓ వ్యక్తిని గదిలోని మూలకు తీసుకువెళ్లి కర్రలతో కొడుతున్నట్లుగా ఆ విజువల్స్ లో ఉంది. కొట్టవద్దని ఆ వ్యక్తి ప్రాధేయపడినప్పటికీ ఆపకుండా వారు కర్కశంగా వ్యవహరిస్తూ విచక్షణారహితంగా దాడి చేశారు. బెంగళూరు నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెలమంగళ గ్రామీణ పోలీసు అధికార పరిధిలోని ఒక ప్రైవేట్ రిహాబిలిటేషన్ సెంటర్ లోనిని అని తేలింది. దీంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి.. ఆ వ్యక్తిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేశారు. బాత్రూమ్‌లు, వార్డెన్ దుస్తులు, శుభ్రం చేయమని చెప్పగా రోగి నిరాకరించాడని.. దీంతో ఆగ్రహించిన వార్డెన్, మరో వ్యక్తి అతడిపై కర్రలతో దాడి చేశారని పోలీసులు తెలిపారు. మరోవైపు, దాడిలో పాల్గొన్న కొంతమంది వ్యక్తులు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వీడియో కూడా వైరల్ అయ్యింది. అందులో కత్తిని వాడి కేక్ కట్ చేస్తున్నట్లు ఉంది. దీంతో, ఆయుధ చట్టం కింద అభియోగాలు మోపుతూ పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు.