రన్‌వేపైనే ప్రయాణికుల భోజనాలు.. ఇండిగో, ముంబై విమానాశ్రయానికి నోటీసులు

by Shiva |   ( Updated:2024-01-16 12:34:47.0  )
రన్‌వేపైనే ప్రయాణికుల భోజనాలు.. ఇండిగో, ముంబై విమానాశ్రయానికి నోటీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఇండిగో, ముంబై విమానాశ్రయానికి కేంద్ర పౌర విమానయాన శాఖ నోటీసులు జారీ చేసింది. తాజాగా, ముంబాయి విమానాశ్రయంలో కొందరు ప్రయాణికులు నేలపై కూర్చుని ఆహారం తింటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గోవా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం గంటల తరబడి ఆలస్యమై ముంబైకి మళ్లించడంతో ప్రయాణికులు రన్‌వేపైనే ఆహారం తీసుకోవలసి వచ్చింది. ఫ్లైట్ 18 గంటల వరకు ఆలస్యమైందని పలువురు వినియోగదారులు చెబుతున్న వీడియో తాజాగా వైరల్‌గా మారింది. రాను రాను దేశీ విమానాలు రైల్వే కంటే అధ్వానంగా మారుతున్నాయని నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే కేంద్ర పౌరవిమానయాన శాఖ స్పందించింది. పరిస్థితులను అంచనా వేయడంలో, ప్రయాణికులకు తగిన సౌకర్యం కల్పించడంలో ఇండిగో సంస్థ, ముంబాయి ఎయిర్‌పోర్టు విఫలమైందని పౌర విమానయాన శాఖ పేర్కొని నోటీసులు అందజేసింది.

Advertisement

Next Story