మొదటి సారి కొత్త భవనంలో పార్లమెంట్ సమావేశాలు.. ఆ తేదీ నుంచే ప్రారంభం !

by Disha Web Desk 21 |
మొదటి సారి కొత్త భవనంలో పార్లమెంట్ సమావేశాలు.. ఆ తేదీ నుంచే ప్రారంభం !
X

దిశ,వెబ్‌డెస్క్: జులై 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 20 నుంచి ఆగస్టు 11 వరకు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఈ సారి సమావేశాలు తొలుత పాత భవనంలో ప్రారంభమై, మధ్యలో కొత్త భవనంలోకి మారతాయని ఇటీవల అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ విషయంలో స్పష్టత ఇంకా రావాల్సి ఉంది.

ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ప్రవేశపెట్టడానికి కేంద్రం సమాయత్తమవుతోంది. ఈ సారి ఉమ్మడి పౌర చట్టం (యూసీసీ) బిల్లును జాబితాలో పెట్టే అవకాశం ఉంది! దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది పార్లమెంటు సభ్యుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అలాగే దీంతో పాటు ఢిల్లీల అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల విషయలో తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై బిల్లును ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది. ఈ ఆర్డినెన్స్ పై కేంద్రం, ఆఫ్ ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాదిలో సార్వాత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇవే చివరి వర్షాకాల సమావేశాలు. ఆ ఎన్నికల్లో భాజాపాను గద్దె దింపాలని విపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా గట్టిగానే ఇరకాటంలో పెట్టాలని యోచిస్తున్నాయి. మణిపూర్ ఘర్షణ అంశంలో ప్రభుత్వాన్ని విపక్షాలు గట్టిగా ప్రశ్నించేందుకు సిద్ధమయ్యాయి.

Next Story

Most Viewed