- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Paris Olympics: వందకు పైగా సైబర్ దాడులు
దిశ, నేషనల్ బ్యూరో: ప్యారిస్ ఒలింపిక్స్ లో వందకు పైగా సైబర్ ఎటాక్ లు జరిగాయని ఫ్రెంచ్ అధికారులు వెల్లడించారు. అయితే, ఆ దాడుల వల్ల పోటీలకు ఎలాంటి అంతరాయం కలగలేదని తెలిపారు. కాగా.. ఒలింపిక్ గేమ్స్, ఆర్గనైజింగ్ కమిటీ, టికెటింగ్, ట్రాన్స్ పోర్టుపై సైబర్ అటాక్ లు జరిగాయి. జూలై 26 నుంచి ఆగస్టు 11 మధ్య మొత్తం 140 సైబర్ దాడులు జరగగా.. వాటిలో 119 వరకు అత్యంత తక్కువ ప్రభావం కలిగినవని ఫ్రెంచ్ అధికారులు వెల్లడించారు. మరో 22 సంఘటనల్లో బాధితుల వ్యక్తిగత సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే, వీటి పట్ల అత్యంత అప్రమత్తంగా ఉన్నట్లు ఫ్రాన్స్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ పేర్కొంది.ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ సెక్యూరిటీ ఏజెన్సీ యాన్సి వివరాలు వెల్లడించింది.
ఎలాంటి నష్టం జరగలేదు
సైబర్ అటాక్ ల వల్ల క్రీడల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు కలగలేదని యాన్సి తెలిపింది. ప్రధానంగా ప్రభుత్వ సంస్థలతో పాటు క్రీడలు, రవాణా, టెలికాం, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా దాడులు జరిగాయని సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. ‘‘ఒలింపిక్ గేమ్స్ సమయంలో సైబర్ ఎటాక్ లు జరిగాయి. కానీ, అవేవీ క్రీడలను ప్రభావితం చేయలేదు. చాలా తక్కువ ప్రభావం చూపించాయి. పారిస్‌లో క్రీడా వేదికలతోపాటు 40 ఇతర మ్యూజియంలపైనా రాన్సమ్‌వేర్ దాడి జరిగింది. డేటాకు ఎలాంటి నష్టం జరగలేదు. గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా జరుగుతాయని భావించాం. కానీ, అలాంటిదేమీ లేదు’’ అని సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది.