అదానీ ఇష్యూపై ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ నుంచి ఈడీ ఆఫీస్‌కు పాదయాత్ర

by Mahesh |
అదానీ ఇష్యూపై ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ నుంచి ఈడీ ఆఫీస్‌కు పాదయాత్ర
X

దిశ, వెబ్‌డెస్క్: మరోసారి పార్లమెంట్ లోపల బయట అదానీ ఇష్యూపై వివాదం కొనసాగింది.. అదానీ వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూపలు ప్రతిపక్ష పార్టీల నేతలు బుధవారం పార్లమెంట్ నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. కాగా ఈ కార్యక్రమంలో ఎన్సీపీ, టీఎంసీ మాత్రం పాల్గొనలేదు. కాగా ప్రతిపక్షాల పాదయాత్ర గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఢిల్లీ ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఎంపీలు తమ నిరసనను విరమించుకోకపోతే చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రతిపక్ష ఎంపీలను హెచ్చరించారు.



Next Story