- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఆ నగరాల్లో తగ్గిన ఉల్లి ధర.. కేజీ ఎంతంటే..
దిశ, వెబ్‌డెస్క్ : గత కొన్ని నెలలుగా ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు మెల్లగా సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి. అయితే ఈ సమాచారాన్ని ప్రభుత్వమే వెల్లడించింది. సబ్సిడీ ఉల్లిని విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కొద్ది రోజుల్లోనే ఉల్లి ధర రూ.5 మేర తగ్గాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభిప్రాయపడుతుంది. ఢిల్లీ, ముంబైతో పాటు చెన్నై, దేశంలోని ఇతర నగరాలల్లో ఉల్లి ధరలు తగ్గుతున్నాయి. ఢిల్లీలో ప్రభుత్వం కిలో ఉల్లిని 35 రూపాయలకు విక్రయిస్తోంది. రిటైల్‌లో ఉల్లి ధరలు ఇప్పటికీ కిలో రూ.50కి పైగానే విక్రయిస్తున్నారు.
ప్రభుత్వ చొరవతో ఉల్లి ధరలు తగ్గుముఖం..
సెప్టెంబర్ 5న ప్రారంభించిన సబ్సిడీ ఉల్లిపాయలను విక్రయించడానికి ప్రభుత్వం తీసుకున్న చొరవ కొన్ని రోజుల్లో ప్రధాన నగరాల్లో ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఢిల్లీలో ఉల్లిపాయల రిటైల్ ధర కిలో రూ.60 నుంచి రూ.55 కి తగ్గగా, ముంబైలో కిలో రూ.61 నుంచి రూ.56 కి పడిపోయిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చెన్నైలో రిటైల్ ధర కిలో రూ.65 నుంచి రూ.58 కి తగ్గింది. ప్రభుత్వం మొబైల్ వ్యాన్‌లు, ఎన్‌సీసీఎఫ్, నాఫెడ్ అవుట్‌లెట్ల ద్వారా కిలోకు రూ.35 సబ్సిడీ ధరకు ఉల్లిపాయలను విక్రయించడం ప్రారంభించింది. ఢిల్లీ, ముంబైలలో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు చెన్నై, కోల్‌కతా, పాట్నా, రాంచీ, భువనేశ్వర్, గౌహతితో సహా ఇతర ప్రధాన నగరాలకు విస్తరించింది.
ఈ నగరాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు..
పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, ప్రభుత్వం సబ్సిడీ ఉల్లిపాయల పరిమాణాన్ని పెంచాలని నిర్ణయించింది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్, కేంద్రీయ భండార్ అవుట్‌లెట్‌లు, మదర్ డెయిరీస్ సఫాల్ స్టోర్‌లను ఈ జాబితాలో చేర్చడానికి పంపిణీ మార్గాలను విస్తరించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, చెన్నైలలో ప్రారంభించారు. అలాగే హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతాకు, చివరికి అన్ని రాష్ట్ర రాజధానులకు ఉల్లి సబ్సిడీ స్కీంను విస్తరించడానికి ప్రణాళికలు ఉన్నాయి.
ఇక ఉల్లి చౌక..
డిమాండ్, ధరల ఆధారంగా లక్ష్య సరఫరాను నిర్ధారించడానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తోంది. గత ఏడాదితో పోలిస్తే 4.7 లక్షల టన్నుల ఉల్లి బఫర్ స్టాక్, ఖరీఫ్ విత్తనం విస్తీర్ణం పెరగడంతో రానున్న నెలల్లో ఉల్లి ధరలు అదుపులోనే ఉంటాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.