జోడో యాత్ర భద్రతకు రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత: మంత్రి నరోత్తమ్ మిశ్రా వ్యాఖ్యలు

by Harish |
జోడో యాత్ర భద్రతకు రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత: మంత్రి నరోత్తమ్ మిశ్రా వ్యాఖ్యలు
X

భోపాల్: రాహుల్ గాంధీకి బాంబు బెదిరింపుల నేపథ్యంలో మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీకి భద్రత కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ' మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాహుల్ గాంధీకి పూర్తి స్థాయిలో భద్రతను కల్పించే బాధ్యతను కలిగి ఉంది. అవసరమైన భద్రతను కల్పించేందుకు మేము కట్టుబడి ఉన్నామని నేను హామీ ఇస్తున్నాను' అని తెలిపారు.

ఖల్సా స్టేడియంలో రాహుల్ బస చేస్తే దాడి చేస్తామని లేఖ లభ్యమైన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీతో పాటు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్‌ను హత్య చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. శుక్రవారం ఈ లేఖ ఇండోర్ లోని స్వీట్ షాప్ లో లభ్యమైన సంగతి తెలిసిందే. మరోవైపు బీజేపీ కమల్ నాథ్ స్టేడియం లోకి ప్రవేశిస్తే నల్ల జెండాలు ప్రదర్శిస్తామని ప్రకటించింది. కాగా, ఈ నెల 24న జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో ప్రవేశించనుంది.

Advertisement

Next Story

Most Viewed