అదానీ కంపెనీలో రైడ్స్.. కలకలం రేపుతోన్న అధికారుల ఆకస్మిక తనిఖీలు!

by Disha Web Desk 19 |
అదానీ కంపెనీలో రైడ్స్.. కలకలం రేపుతోన్న అధికారుల ఆకస్మిక తనిఖీలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హిండెన్ బర్గ్ నివేదికతో ఇప్పటికే ఇబ్బందుల్లో చిక్కుకున్న అదానీ గ్రూప్‌కు మరో షాక్ తగిలింది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఎక్సైజ్ అండ్ ట్యాక్సెషన్ విభాగం అదానీ గ్రూప్‌కు చెందిన కంపెనీలో సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ప్రస్తుతం దేశ రాజకీయాలతో పాటు పార్లమెంట్‌ను అదానీ వ్యవహారం కుదిపేస్తోంది. హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు కూడా ప్రభావితం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ విల్మర్ గోదాములో నిల్వలను తనిఖీ చేసిట్లు గురువారం అధికారులు తెలిపారు. అయితే జీఎస్టీ ఉల్లంఘనల నేపథ్యంలోనే ఈ సోదాలు జరిగినట్లు తొలుత ప్రచారం జరిగినప్పటికీ ఇది తరచూ జరిపే సాధారణ తనిఖీల్లో భాగమేనని హిమాచల్ ఎక్సైజ్ అధికారి ఒకరు వెల్లడించారు. అదానీ విల్మర్ తమ జీఎస్జీ ఇన్ పుట్‌ను పూర్తిగా సర్దుబాటు చేసిన ట్యాక్స్ క్రెడిట్ ద్వారానే చెల్లించిందని ఎక్సైజ్ అధికారి తెలిపారు. నగదు రూపంలో ఎలాంటి చెల్లింపులు జరగలేదని పేర్కొన్నారు.

Also Read...

విపక్షాలకు మోడీ స్ట్రాంగ్ కౌంటర్.. ప్రధాని ఎదురు దాడి వెనుక భారీ వ్యూహం..!



Next Story

Most Viewed