ప్రత్యర్థుల మధ్య యుద్ధం కాదు.. స్నేహపూర్వక పోటీ మాత్రమే..

by Dishanational4 |
ప్రత్యర్థుల మధ్య యుద్ధం కాదు.. స్నేహపూర్వక పోటీ మాత్రమే..
X

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో బరిలో దిగనున్న ఎంపీ శశిథరూర్, మరో అభ్యర్థి సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌తో సమావేశమయ్యారు. తమది ప్రత్యర్థుల మధ్య యుద్ధం కాదని, సహోద్యోగుల మధ్య స్నేహపూర్వక పోటీ అని అంగీకరించామని శశిథరూర్ పేర్కొన్నారు. ఈ మేరకు దిగ్విజయ్ సింగ్‌తో ఆహ్వానం మేరకు మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం ట్వీట్ చేశారు. 'గురువారం మధ్యాహ్నం దిగ్విజయ్ సింగ్‌తో సమావేశమయ్యాను.

ఆయన ఎన్నికల్లో పోటీ చేయడాన్ని స్వాగతిస్తున్నాను. సన్నిహితుల మధ్య స్నేహపూర్వక పోరుకు మేమిద్దరం అంగీకరించాం. మా ఇద్దరికీ కావాల్సింది కాంగ్రెస్ గెలుపే' అని పేర్కొన్నారు. కాగా, ఇరువురు నేతలు శుక్రవారమే నామినేషన్ దాఖలు చేయనున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ మధ్యకాలంలో ఏకగ్రీవంగా అధ్యక్ష ఎన్నిక జరిగింది. శుక్రవారంతో నామినేషన్లు ఇవ్వడానికి తుది గడువు. ఖరారైన అభ్యర్థులను శనివారం ప్రకటిస్తారు. వచ్చే నెల 8 లోపు నామినేషన్లు వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. వచ్చే నెల 17న ఎన్నికలు జరగనుండగా, 19న ఫలితాలు వెలువడనున్నాయి.

Next Story