- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రూ.120 కోట్ల అక్రమార్జన.. నోయిడా స్క్రాప్ మాఫియా డాన్ అరెస్టు
దిశ, నేషనల్ బ్యూరో: థాయ్ లాండ్ లో స్క్రాప్ మెటీరియల్ మాఫియా డాన్ రవి కానాను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. రవి కానాతో పాటు అతని గర్ల్‌ఫ్రెండ్ కాజల్ ఝాను పోలీసులు అరెస్ట్ చేశారు. రవి కానా పశ్చిమ ఉత్తర ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ రవి కానా అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఆతని కోసం గత కొంతకాలంగా నోయిడా పోలీసులు వెతుకుతున్నారు.
నోయిడా పోలీసులు థాయ్‌లాండ్ పోలీసులతో టచ్ లో ఉన్నారు. దీంతో రవి కానాకు సంబంధించిన అన్ని వివరాలను ఎప్పటికప్పుడు నోయిడా పోలీసులు తెలుసుకున్నారు. జనవరిలో రవి కానాపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినట్లు నోయిడా పోలీసులు పేర్కొన్నారు.
రవీంద్రనగర్‌లో 16 మంది గ్యాంగ్‌స్టర్లతో కలిసి చట్టవ్యతిరేక స్క్రాప్ మెటీరియల్ సరాఫరా, అమ్మకం దందా నిర్వహించాడు రవి కానా. స్క్రాప్ మెటీరియల్ డీలర్ అవతారమెత్తిన ఆయన.. ఢిల్లీలోని పలువురు వ్యాపారులను దోపిడి చేసి తక్కువ కాలంలోనే కోట్లు సంపాదించాడు. దొంగతనం, కిడ్నాప్ నకు సంబంధించిన ఆరోపణలతో అతనిపై 11 కేసులు నమోదయ్యాయి. పలు స్క్రాప్ గోడౌన్లను చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించుకున్నాడు. రవి కానా గ్యాంగ్‌లోని ఆరుగురు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు.
ఇటీవల రవి కానా, అతని భాగస్వాములకు సంబంధించి సుమారు రూ.120 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపారు. రవి తన గర్ల్‌ఫ్రెండ్ కాజల్ ఝాకు బహుమతిగా ఇచ్చిన దక్షిణ ఢిల్లీలోని రు.100 కోట్ల బిల్డింగ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిని కాజల్ ఝా పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. గౌతంబుద్ధనగర్, బులంద్ షహర్‌లలో కూడా దాదాపు రూ.350 కోట్ల ఆస్తులను అక్రమంగా సంపాదించినట్టు గుర్తించారు.
ఉద్యోగం కోసం గ్యాంగ్‌స్టర్ రవిని సంప్రదించిన కాజల్ ఝా తర్వాత అదే గ్యాంగ్‌లో కీలక వ్యక్తిగా మారారు. ఇక.. ఈ గ్యాంగ్, రవికి సంబంధించిన అన్ని బినామీ ఆస్తులకు ఆమె ఇన్‌ఛార్జీగా వ్యవహరిస్తున్నారు.