మోడీకి నోబెల్ ప్రైజ్ : ఫేక్ అంటూ క్లారిటీ ఇచ్చిన నోబెల్ కమిటీ మెంబర్

by Rajesh |
మోడీకి నోబెల్ ప్రైజ్ : ఫేక్ అంటూ క్లారిటీ ఇచ్చిన నోబెల్ కమిటీ మెంబర్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోదీని నోబెల్ బహుమతికి పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలపై నోబెల్ కమిటీ మెంబర్ అస్లే టోజే క్లారిటీ ఇచ్చారు. అది ఓ ఫేక్ ట్వీట్ అని ఆయన అన్నారు. తాను అన్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది నోబెల్ ప్రైజ్‌కు ప్రధాన పోటీదారుగా ప్రధాని నరేంద్ర మోదీపై వస్తున్న పుకార్లపై నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్ అస్లే టోజే స్పందించారు. ‘ఇది పూర్తిగా ఫేక్’ అన్నారు. ఒక నకిలీ ట్వీట్ వైరల్ అయిందన్నారు. ‘దాని గురించి చర్చించవద్దని కోరారు.

ఇలాంటి వార్తలను వ్యాపించొద్దని రిక్వెస్ట్ చేశారు. తాను అలా చెప్పలేదని ఆ వార్తలను ఖండిస్తున్నానని క్లారిటీ ఇచ్చారు. తన పర్యటన ఉద్దేశం గురించి మాట్లాడుతూ, "నేను నార్వేజియన్ నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్‌గా భారతదేశంలో లేను, అంతర్జాతీయ శాంతి మరియు అవగాహన డైరెక్టర్‌గా మరియు భారతదేశ స్నేహితుడిగా ఇక్కడ ఉన్నాను" అని అన్నారు. అయితే రష్యా-ఉక్రెయిన్ వివాదం సమయంలో "ఇది యుద్ధ యుగం కాదు" అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు గుర్తు చేసినందుకు భారత ప్రధాని గురించి చాలా గొప్పగా మాట్లాడారు అని టోజే తెలిపారు.

ఓ మీడియా సంస్థతో తాజాగా మాట్లాడిన ఆయన 'ఇది యుద్ధ యుగం కాదు' అని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటన ఆశాకిరణమన్నారు. ప్రధాని మోడీకి ప్రపంచ వ్యాప్తంగా క్రెడిబిలిటీ ఉందన్నారు. ప్రపంచ జనాభాలో ఎక్కువ మంది అతని వెనుక ఉన్నారన్నారు." రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై, ఆయన మాట్లాడుతూ, "ఉక్రెయిన్‌లో యుద్ధం ఒక విషాదం. ఇది ముగింపునకు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

అన్ని దేశాలు మరియు సుహృద్భావ దేశాలు ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించాలని కాంక్షించారు. భారతదేశం యొక్క జోక్యాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించాలన్నారు. అణ్వాయుధాల యొక్క వాస్తవ వినియోగ స్పృహ రష్యాకు ఉందన్నారు. ప్రపంచ వివాదాలను యుద్ధం ద్వారా పరిష్కరించుకోకూడదన్న సంకేతం భారత్ ఇచ్చిందన్నారు.

ప్రపంచ జనాభాలో మెజారిటీ ప్రజల మద్దతు ప్రధాని మోదీకి ఉందని టోజే పేర్కొన్నారు. భారతదేశం ఎవరినీ బెదిరించకుండా స్నేహపూర్వకంగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తుందని ప్రశంసించారు. “భారతదేశం గట్టిగా మాట్లాడదని ఎవరినీ బెదిరించదన్నారు. భారతదేశం ప్రపంచంలోని ప్రాథమిక శక్తులలో ఒకటన్నారు. "అంతర్జాతీయ రాజకీయాల్లో మనకు ఇది మరింత అవసరం" అని టోజే పేర్కొన్నారు.

Next Story