రామమందిర నిర్మాణం జరుగుతుందని ఎవరూ అనుకోలేదు : అమిత్‌ షా

by Disha Web Desk 13 |
రామమందిర నిర్మాణం జరుగుతుందని ఎవరూ అనుకోలేదు : అమిత్‌ షా
X

న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతుందని గతంలో బీజేపీ చెప్పినప్పుడు ఎవరూ నమ్మలేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ఆనాడు చెప్పిందే ఈనాడు జరిగిందని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఏబీవీపీ 69వ జాతీయ సమావేశానికి అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, అభివృద్ధి అనేవి రెండు విరుద్ధమైన అంశాలు కావని ఆయన తేల్చి చెప్పారు. ‘‘గత పదేళ్లలో దేశంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అవినీతి, బంధుప్రీతి, కులతత్వాలను బీజేపీ సర్కారు అభివృద్ధితో భర్తీ చేసింది’’ అని తెలిపారు. విద్య అనేది కేవలం భావితరాల కెరీర్‌ కోసమే కాకుండా.. దేశ నిర్మాణానికీ అవసరమేనన్నారు.Next Story

Most Viewed