‘ఇగో క్లాష్’ సమస్య లేదు.. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పడాలి : మమతా బెనర్జీ

by Vinod kumar |
‘ఇగో క్లాష్’ సమస్య లేదు.. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పడాలి : మమతా బెనర్జీ
X

కొల్ కతా: బీజేపీకి వ్యతిరేంగా కూటమిని ఏర్పాటు చేసే విషయంలో తమ మధ్య ఎలాంటి ‘ఇగో క్లాష్’లు లేవని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమయ్యేందుకు పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. సోమవారం బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్, ఆర్జేడీ నేత, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కొల్ కతాలో మమతను కలిశారు. నితీష్ ప్రయత్నాలకు పూర్తి సహకారం ఉంటుందని మమత ఈ సందర్భంగా చెప్పారు. వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు బీజేపీ వర్సె్స్ ప్రజలుగా జరగనున్నాయని తెలిపారు. విపక్ష పార్టీలు ‘ఒక సీటు-ఒక అభ్యర్థి’ ఫార్ములకు కట్టుబడితే కాషాయ పార్టీని నిలువరించడం సులభమే అన్నారు.

బీహార్‌లో అఖిలపక్ష సమావేశం..

బిహార్‌లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి విపక్షాలన్నీ ఐక్యంగా ఉన్నాయనే సందేశాన్ని దేశ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉందని మమత చెప్పారు. లోక్ సభ ఎంపీగా రాహుల్ గాంధీపై వేటు పడిన తర్వాత విపక్షాల్లో అనూహ్యంగా ఐక్యత పెరిగింది. నితీష్, తేజస్వి ఇటీవల కాంగ్రెస్ నేతలైన రాహుల్, మల్లికార్జున ఖర్గేలతోనూ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తోనూ సమావేశమయ్యారు. దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి కేంద్రంలో ప్రభుత్వాన్ని మార్చడం చాలా అవసరమని కేజ్రీవాల్ అంగీకరించారు.

Next Story

Most Viewed