కేజ్రీవాల్‌ది 'దిక్కూమాలిన ట్విస్ట్'.. కేంద్రమంత్రి ఫైర్..

by Dishanational4 |
కేజ్రీవాల్‌ది దిక్కూమాలిన ట్విస్ట్.. కేంద్రమంత్రి ఫైర్..
X

న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌కు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కౌంటర్ ఇచ్చారు. ఉచితాలపై చర్చలో కేజ్రీవాల్ దిక్కుమాలిన ట్విస్ట్ ఇచ్చారని విమర్శించారు. ఆప్ నేత ప్రజల్లో భయాన్ని సృష్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. స్వాతంత్రం తర్వాత ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఆరోగ్యం, విద్యపై వెచ్చించడాన్ని ఉచితాలుగా ఎప్పుడూ చెప్పలేదని సీతారామన్ అన్నారు. ఏ భారత ప్రభుత్వం వీటిని తిరస్కరించలేదని చెప్పారు. అయితే కేజ్రీవాల్ వీటిని ఉచితాలుగా పేర్కొంటూ ప్రజల ఆలోచనల్లో భయాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అంతకుముందు కేజ్రీవాల్ ప్రధాని మోడీపై తీవ్రంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.



Next Story