కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ కలకలం.. ఇద్దరు మృతి!

by Disha Web Desk 12 |
కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ కలకలం.. ఇద్దరు మృతి!
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో కేరళ రాష్ట్రంలో మరోసారి నిఫా వైరస్ మరణాలు సంచలనంగా మారాయి. గతంలో భారీగా విజృంభించిన ఈ వైరస్.. తాజాగా మనుగడలోకి వచ్చింది. కాగా ఈ వైరస్ కారణంగా కేరళ లో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. అలాగే మరణించిన ఓ వ్యక్తి బంధువు కూడా ఈ వైరస్ కారణంగా ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ కారణంతో అధికారులు కోజికోడ్ జిల్లాల్లో హెల్త్ అలర్ట్ జారీ చేశారు. కాగా నిఫా వైరస్ మరణాలపై వైద్యశాఖ మంత్రి వీణ జార్జ్ హైలెవల్ మీటింగ్ నిర్వహించి, పరిస్థితిపై ఆరా తీశారు. అలాగే ఇద్దరి మృతికి గల స్పష్టమైన కారణాలను అన్వేషించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. కాగా ఇవాళ సాయంత్రానికి ఫలితాలు వెలువడి, ఆ తర్వాతే నిపా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ని నిర్ధారించవచ్చని అధికారలు వెల్లడించారు. కోజికోడ్ గతంలో రెండు నిపా వైరస్ వ్యాప్తిని ఎదుర్కున్నది. మొత్తం 23 కేసులు గుర్తించబడ్డాయి. 17 మంది ఈ జూనోటిక్ వైరస్‌కు గురయ్యారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, నిపా వైరస్ సంక్రమణ అనేది జంతువుల నుంచి ప్రజలకు సంక్రమించే జూనోటిక్ వ్యాధి. కలుషితమైన ఆహారం ద్వారా లేదా నేరుగా వ్యక్తి నుంచి వ్యక్తికి కూడా సంక్రమిస్తుంది.

Next Story

Most Viewed