న్యూస్ పేపర్ భగవద్గీత కాదు..‘పిల్’ను రిజెక్ట్ చేసిన ఢిల్లీ కోర్టు

by Dishaweb |
న్యూస్ పేపర్ భగవద్గీత కాదు..‘పిల్’ను రిజెక్ట్ చేసిన ఢిల్లీ కోర్టు
X

న్యూఢిల్లీ: యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ (డియు) వైస్ ఛాన్స్‌లర్‌గా (వీసీ) ప్రొఫెసర్ యోగేష్ సింగ్ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పీల్) ఢిల్లీ హై కోర్టు బుధవారం కొట్టేసింది. వార్తా పత్రికలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ పిల్ దాఖలైందని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పిటిషన్‌ను విచారించేందుకు తిరస్కరించింది. వార్తా పత్రిక నివేదికలు భగవద్గీత కాదని కోర్టు పేర్కొంది. పిటిషన్‌లో అనేక నిర్లక్ష్యపు ఆరోపణలు ఉన్నాయని, ఈ విషయంలో భారత రాష్ట్రపతి ప్రమేయం కూడా ఉందని వ్యాఖ్యానించింది. పిటిషనర్ పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ‘భారత రాష్ట్రపతి ప్రమేయం ఉన్న ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు మేము అనుమతించం. పిటిషన్‌లో మీరు చాలా నిర్లక్షంగా ఆరోపణలు చేశారు. వార్తా పత్రికల క్లిప్పింగుల ఆధారంగా పిల్ దాఖలు చేశారు. దానికి తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు’ అని జస్టిస్ సతీష్ చంద్ర అన్నారు. నిబంధనలను విరుద్ధంగా యోగేష్ సింగ్‌ను వీసీ పదవిలో నియమించారంటూ ఫోరం ఆఫ్ ఇండియన్ లెజిస్ట్స్ అనే సంస్థ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.


Next Story

Most Viewed