గుండెలు పగిలేలా ఏడ్చిన నవ వధువు.. యావద్దేశాన్ని కన్నీరు పెట్టిస్తున్న వీడియో

by Mahesh |   ( Updated:2025-04-23 15:28:08.0  )
గుండెలు పగిలేలా ఏడ్చిన నవ వధువు.. యావద్దేశాన్ని కన్నీరు పెట్టిస్తున్న వీడియో
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ, కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్‌ (Pahalgam)లోని బైసరన్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు ఉగ్రవాదులు (Terrorists) ఆర్మీ యూనిఫాంలలో వచ్చి, ట్రెక్కింగ్‌కు వెళ్లిన పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు. వారు ఐడీ కార్డులను తనిఖీ చేసి, పేరు, మతం అడిగి పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 28 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కాగా ఉగ్రవాదులు జరిపిన ఈ కాల్పుల్లో (firing) ఎక్కువగా నూతనంగా పెళ్లి అయిన జంటలే ఉన్నారు. వీరంతా హనీమూన్ (Honeymoon) కోసం అక్కడికి వెళ్లారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో ఉగ్రవాదులు కాల్పులు (Terrorist firing) జరపడంతో తమ ప్రాణాలు కోల్పోయారు.

అయితే ఉగ్రవాదులు కొంతమంది మహిళలను వదిలివేయగా.. వారు ఉగ్రవాదులు దుశ్చర్యలను మీడియాకు వివరించారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ వీడియో దేశ ప్రజలను కన్నీటి పర్యంతం చేసింది. వీడియో‌లో ఉగ్రవాదుల కాల్పులో మరణించిన తన భర్త మృతదేహం నవ వధువు గుండెలు పగిలేలా ఏడ్చింది. అక్కడే ఉన్న తన కుటుంబ సభ్యులు ఎంత ఓదార్చినా కూడా ఆమె ఏడుపు ఆపుకోలేక పోయింది. ఇది చూసిన నెటిజన్లు కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. అలాగే ఆ వీడియోపై స్పందిస్తూ.. నవ వధువు భాద తీరాలంటే ప్రతీకారమే మార్గమని, మరోసారి ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్ చేసి.. మృతుల ఆత్మకు శాంతి చేకురేలా చేయాలని కామెంట్లు చేస్తున్నారు.



Next Story

Most Viewed