త్వరలోనే అన్ని మదర్సాలను మూసివేస్తాం: సీఎం

by Disha Web Desk 23 |
త్వరలోనే అన్ని మదర్సాలను మూసివేస్తాం: సీఎం
X

బెంగళూరు: అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలోనే అన్ని మదర్సాలను మూసివేస్తామని అన్నారు. శుక్రవారం కర్ణాటక బెలగావిలో విజయ్ సంకల్ప్ యాత్రలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం ఇప్పటికే 600 మదర్సాలను మూసివేసినట్లు చెప్పారు. మనకు మదర్సాలు అక్కర్లేదని.. ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని చెప్పారు. నవీన భారతానికి మదర్సాలకు బదులుగా స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు కావాలని నొక్కి చెప్పారు. మదర్సాలను తగ్గించాలని లేదా ఈ సంస్థలలో ఇస్తున్న విద్యను పరిశీలించాలని సూచించినట్లు తెలిపారు. అస్సాంలో ప్రస్తుతం 3 వేలకు పైగా మదర్సాలు ఉన్నాయి.Next Story

Most Viewed