- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
గగన్‌యాన్ క్రూ మాడ్యుల్ కోసం నేవీ, ఇస్రో శిక్షణ..
న్యూఢిల్లీ: భారతదేశం ఎన్నో ఏళ్ళ కల సాకారం దిశగా ఒక ముఖ్యమైన అడుగు పడింది. భారతీయుడిని అంతరిక్షంలోకి పంపేందుకు గగన్‌యాన్ మిషన్ ప్రారంభమైంది. ఇండియన్ నేవీ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) గగన్‌యాన్ రికవరీ ట్రైనింగ్ ప్లాన్‌ను కొచ్చిలోని ఐఎన్ఎస్ గరుడలోని వాటర్ సర్వైవల్ ట్రైనింగ్ ఫెసిలిటీ వద్ద ప్రారంభించింది. తొలుత రెండు మానవ రహిత విమానాలను ప్రయోగిస్తారు. తర్వాత 2024 త్రైమాసికంలో మానవ సహిత విమానం వెళుతుంది.
‘డైవర్లు, మార్కోలు (మెరైన్ కమెండోలు), మెడికల్ స్పెషలిస్ట్‌లు, కమ్యూనికేటర్లు, టెక్నీషియన్లు, నేవల్ ఏవియేటర్లతో సహా వివిధ బృందాలు ఈ శిక్షణలో పాల్గొంటారు’ అని నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. భారత నావికాదళం నాయకత్వంలో మానవ రహిత రికవరీ నుంచి నౌకాశ్రయంలో మానవ సహిత రికవరీ వరకు వివిధ దశల్లో శిక్షణ ఉంటుంది.
శిక్షణ పత్రాన్ని నావల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ వైస్ అడ్మిరల్ అతుల్ ఆనంద్, విక్రమ్ సారాభాయ్ స్పెస్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్ (వీఎస్ఎస్‌సీ), ఇస్రోకు చెందిన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (హెచ్ఎస్ఎఫ్‌సీ) డైరెక్టర్ డాక్టర్ ఆర్ ఉమామహేశ్వర్ సంయుక్తంగా విడుదల చేశారు. క్రూ మాడ్యూల్ రికవరీ మోడల్‌ను కొచ్చిలోని అత్యాధునిక డబ్ల్యూఎస్‌టీఎఫ్‌లో భారత నావికాదళానికి అధికారికంగా అందజేశారు. గగన్‌యాన్ సిబ్బందికి, రికవరీ టీమ్‌లకు శిక్షణ ఇచ్చేందుకు వరుస ట్రయల్స్‌ను నిర్వహించడం ఇస్రోకు మరింత సహాయపడుతుందని నేవీ తెలిపింది.