‘నమో భారత్’ పరుగులు.. దేశంలోనే తొలి రాపిడ్ ఎక్స్ రైళ్లను ప్రారంభించిన మోడీ

by Disha Web Desk 4 |
‘నమో భారత్’ పరుగులు.. దేశంలోనే తొలి రాపిడ్ ఎక్స్ రైళ్లను ప్రారంభించిన మోడీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న రీజినల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (ఆర్‌ఆర్‌టీఎస్‌) సెమీ హైస్పీడ్‌ రైళ్లకు ‘నమో భారత్‌’ ట్రైన్స్‌గా నామకరణం చేశారు. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మధ్య నడిచే ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్‌ఆర్‌టీఎస్)లోని 17 కిలోమీటర్ల సెక్షన్‌ను ప్రధాని మోడీ ఇవాళ ప్రారంభించారు. యూపీలోని షహీదాబాద్ కారిడార్లో యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోడీ అందులో ప్రయాణించారు. మరోవైపు స్కూల్ విద్యార్థులు, ప్రయాణికులతో ముచ్చటించారు. కాగా, రేపటి నుంచి ఈ రాపిడ్ ట్రాన్సిట్ రైళ్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే ఇవి ప్రతి 15 నిమిషాలకు ఒకటి అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ రైళ్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నడుస్తాయని అధికారులు తెలిపారు.


Next Story

Most Viewed