శతాధిక స్వాతంత్ర్య సమరయోధుడు ఎన్ శంకరయ్య మృతి

by Disha Web Desk 10 |
శతాధిక స్వాతంత్ర్య సమరయోధుడు ఎన్ శంకరయ్య మృతి
X

చెన్నై: తమిళనాడుకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎం) ప్రముఖ నాయకుడు ఎన్ శంకరయ్య మృతి చెందినట్లు పార్టీ రాష్ట్ర కార్యాలయం బుధవారం వెల్లడించింది. ఎన్ శంకరయ్య 102 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన జ్వరంతో ఇబ్బంది పడుతున్న ఆయనను కుటుంబసభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. జ్వరంతో పాటు జలుబు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న శంకరయ్యకు చికిత్స అందిస్తున్న సమయంలోనే బుధవారం ఉదయం మరణించారు. తమిళనాడుకు చెందిన ఎన్ శంకరయ్య దేశ స్వాతంత్ర్య పోరాటంలో విద్యార్థి ఉద్యమ నిరసనలకు నాయకత్వం వహించారు. 1996 నుండి 2001 వరకు సీపీఐ(ఎం) తమిళనాడు కార్యదర్శిగా పనిచేశారు. వెస్ట్ మదురై, ఈస్ట్ మదురై నుంచి తమిళనాడు శాసనసభ సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు. 'కమ్యూనిస్టు నాయకుడిగా సుధీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న ఆయన, పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. ఆయన మనతో కలకాలం జీవిస్తారని ' పార్టీ రాష్ట్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, శంకర్య్య భౌతికకాయాన్ని చెన్నైలోని సీపీఐ(ఎం) కార్యాలయానికి తరలించారు. అభిమానుల సందర్శన అనంతరం నివాసానికి, అక్కడినుంచి అంత్యక్రియలకు తరలించనున్నారు.

Next Story