స్వదేశానికి 75 మంది మయన్మార్ సైనికులు

by Disha Web Desk 16 |
స్వదేశానికి 75 మంది మయన్మార్ సైనికులు
X

ఐజ్వాల్: మయన్మార్‌లో సైన్యానికి, మిలిటెంట్ గ్రూపులకు మధ్య భీకర పోరు జరుగుతోంది. ఈక్రమంలో భారత్‌కు చెందిన మిజోరం రాష్ట్ర సరిహద్దు సమీపంలోని రెండు మయన్మార్ మిలిటరీ బేస్‌లను మిలిటెంట్లు ఈ నెల 16న స్వాధీనం చేసుకున్నారు. ఆ ఘటన జరిగిన వెంటనే కాలినడకన, నిరాయుధులుగా భారత్‌లోకి ప్రవేశించి ఆశ్రయం పొందిన మయన్మార్ సైనికుల్లో 46 మందిని శుక్రవారం రాత్రి నాటికే భారత్ వెనక్కి పంపింది. తాజాగా ఆదివారం మరో 29 మంది మయన్మార్‌ సైనికులను తిరిగి వారి దేశానికి పంపించామని మిజోరం డీజీపీ అనిల్ శుక్లా వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు స్వదేశానికి వెళ్లిపోయిన మయన్మార్ సైనికుల సంఖ్య 75కు చేరిందని తెలిపారు. చొరబాట్లను అడ్డుకునేందుకు మయన్మార్ బార్డర్‌లో పెద్దసంఖ్యలో సైన్యాన్ని మోహరించామని ఆయన చెప్పారు. మయన్మార్‌లో ఘర్షణల కారణంగా 2021 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 31,000 మంది మయన్మార్‌వాసులకు మిజోరాంలో ఆశ్రయం కల్పించారు. వీరిలో ఎక్కువ మంది చిన్‌ వర్గానికి చెందినవారే.

Next Story