వక్ఫ్ బోర్డు చేసిందేమి లేదు.. కేవలం ధనిక ముస్లింల కోసమే అంటున్న ముస్లిం నేతలు

by Mahesh |   ( Updated:2025-04-15 05:52:04.0  )
వక్ఫ్ బోర్డు చేసిందేమి లేదు.. కేవలం ధనిక ముస్లింల కోసమే అంటున్న ముస్లిం నేతలు
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం (Waqf Amendment Act) ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారింది. కేంద్ర ప్రభుత్వం (Central Govt) పార్లమెంట్ ద్వారా తీసుకొచ్చిన ఈ చట్టంపై ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో నిరసనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో నిరసనలు (protests) చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ విడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో చదువుకున్న ముస్లిం నేతలు వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడిన విషయాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఆ వీడియోలో ఓ ముస్లిం నేత మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డు వల్ల సామాన్య ప్రజలకు ఎటువంటి లాభం లేదని కేవలం ముస్లిం సంపన్న వ్యక్తుల కోసమే పని చేస్తుందని అన్నారు.

వక్ఫ్ బోర్డు గురించి కనీసం సామాన్య ముస్లిం ప్రజలకు (Common Muslim people) ఏమీ తెలియదని, దాని గురించిన సమాచారం సాధారణ ముస్లింకు తెలియదని, కేవలం ధనిక ముస్లిం నేతలకే ఆ సమాచారం తెలుసని, వాళ్లే వక్ఫ్ వల్ల మరింత ధనికులుగా మారుతున్నారని అన్నారు. అలాగే మరో వ్యక్తి మాట్లాడుతూ.. ఇంతవరకు వక్ఫ్ బోర్డు వల్ల ఒక్క పేద ముస్లింలకు ఆహారం, నివాసం అందలేదని అన్నారు. కరోనా సమయంలో వందలాది మంది చనిపోతున్న.. వక్ఫ్ బోర్డు నుంచి ఒక్క ముస్లిం వ్యక్తికి కూడా కనీసం ఒక్క కోవిడ్ కిట్ కూడా అందించలేదని మండిపడ్డారు. కనీసం వక్ఫ్ బోర్డు నుంచి పేద ప్రజలకు భోజనాలు కూడా పెట్టలేకపోయిందని, ఈ వక్ఫ్ బోర్డు సాధరణ ముస్లిం ప్రజలకు ఏం చేస్తుందని ఆ వ్యక్తులు ప్రశ్నించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



Next Story

Most Viewed