కేరళలో ప్రత్యేక వివాహ చట్టం కింద అధిక సంఖ్యలో పెళ్లిళ్లు.. ఎందుకంటే?

by Shamantha N |
కేరళలో ప్రత్యేక వివాహ చట్టం కింద అధిక సంఖ్యలో పెళ్లిళ్లు.. ఎందుకంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలో ప్రత్యేక వివాహ చట్టం ద్వారా పెళ్లిళ్లు నమోదు చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. వారసత్వ సంపదలో చట్టబద్ధత కోసం పలువురు ప్రత్యేక ముస్లిం చట్టం ద్వారా వివాహం చేసుకుంటున్నారు. గతంలో మలయాలీ నటుడు, న్యాయవాది సీ శుక్కర్ పెళ్లయిన 29 ఏఏళ్లకు తన భార్యనే ప్రత్యేక వివాహం చట్టం కింద మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అయితే, సమాచార హక్కు చట్టం ద్వారా ప్రత్యేక వివాహ చట్టంతో ఎంత మంది పెళ్లి చేసుకున్నారనే వివరాలను శుక్కర్ సేకరించారు. జనవరి 1, 2020 నుండి జూన్ 2024 వరకు కేవలం రెండు జిల్లాల్లోనే దాదాపు 277 వివాహాలు నమోదయ్యాయని తెలిపారు. కాసరగోడ్ జిల్లాలో 133, త్రిసూర్ లో 144 వివాహాలు ఎస్ఎంఏ చట్టం కింద నమోదయ్యాయని చెప్పారు. వాటిలో అత్యధికంగా త్రిసూర్ లోని అంతికాడ్ లో 80 పెళ్లిళ్లు రికార్డయ్యాయని పేర్కొన్నారు. ఇతర జిల్లాల నుండి ఇంకా వివరాలు అందవలసి ఉందన్నారు. కుమార్తెలు మాత్రమే ఉన్న మరిన్ని కుటుంబాలు వారికి ఆస్తిని అందించండలో చట్టబద్ధత కోసం ఇలా పెళ్లిళ్లు చేసుకుంటున్నారని వివరించారు.

షరియత్ లా ఏం చెప్తుందంటే?

ముస్లిం పర్సనల్ లా (షరియత్) ప్రకారం, మగ పిల్లలకి మాత్రమే తమ తల్లిదండ్రుల ఆస్తిని పూర్తిగా దక్కతుంది. కూతుర్లకి మాత్రం మూడింట రెండొంతుల ఆస్తి మాత్రమే దక్కుతుంది. మిగిలిన భాగం తండ్రి సోదరులకి చెందుతుంది. ఇది శుక్కుర్ దంపతులకి నచ్చలేదు. అందుకే కుమార్తెలకు చట్టబద్ధంగా సంపద ఇచ్చేందుకు చాలా మంది ప్రత్యేక వివాహ చట్టం ద్వారా పెళ్లి చేసుకుంటున్నారు. సామాజిక కార్యకర్త ఎంఎన్ కారస్సేరి ఈ ధోరణిని స్వాగతించారు. షరియత్ చట్టాలు సవరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. లింగ వివక్ష లేకుండా వారసత్వాన్ని సమానంగా విభజించాలని ప్రగతిశీల ముస్లిం మహిళా సంఘం నాయకురాలు వీపీ సుహ్రా డిమాండ్ చేశారు. ట్రాన్స్‌జెండర్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే, ‘సమానత్వ ఉద్యమం’లో భాగంగా ఎర్నాకులం, త్రిస్సూర్ లో ప్రత్యేక వివాహ చట్టం ద్వారా పెళ్లి చేసుకున్న వారి కోసం నటుడు శుక్కర్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అక్టోబర్ 2న ఎర్నాకులంలో ఈ ఈవెంట్ జరగనుంది.

Next Story

Most Viewed