ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ

by Mahesh |
ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 78 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతుంది.2024 పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 78 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే మోహన్ చరణ్ మాఝీ‌ని బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన ఈ నెల 12 బుధవారం సాయంత్రం 5 గంటలకు ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే డిప్యూటీ సీఎంలుగా కనకవర్ధన్ సింగ్ దేవ్, ప్రవతి పరిదా సింగ్ దేవ్‌లు రేపు సీఎంతో పాటు ప్రమాణ స్వీకారం చేయున్నారు. అలాగే పలువురు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మోహన్ చరణ్ మాఝీ భారతీయ జనతా పార్టీ సభ్యునిగా 2019 ఒడిశా శాసనసభ ఎన్నికలలో కియోంజర్ నుండి ఒడిశా శాసనసభకు ఎన్నికయ్యారు. అతను 2000 నుండి 2009 సంవత్సరాలలో కియోంజర్‌కు రెండుసార్లు, మొత్తం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 147 స్థానాలున్న ఒడిశా అసెంబ్లీలో బీజేపీ 78 సీట్లు గెలుచుకుని మెజారిటీ సాధించి.. ఒడిశాలో మొట్టమొదటి సారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.



Next Story

Most Viewed