ఏఐఐఓ చీఫ్‌ను కలిసిన మోహన్ భగవత్

by DishaWebDesk |
ఏఐఐఓ చీఫ్‌ను కలిసిన మోహన్ భగవత్
X

న్యూఢిల్లీ: ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ (ఏఐఐఓ) చీఫ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసిని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ గురువారం భేటీ అయ్యారు. ఢిల్లీలోని కస్తూర్భా గాంధీ మార్గ్‌లో ఉన్న మసీదులో సమావేశమయ్యారు. గది తలుపులు మూసుకుని దాదాపు గంట పాటు చర్చించారు. ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి సునీల్ అంబేకర్ తెలిపిన వివరాల ప్రకారం.. నుపూర్ శర్మ వివాదం, హిజాబ్ వివాదం, జ్ఞానవాపి, మతాల మధ్య శాంతి, సామరస్యం తదితర అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ అన్ని వర్గాల ప్రజలను కలుస్తారని, నిరంతర సంవాద్ ప్రక్రియలో భాగంగా సమావేశమైనట్లు అంబేకర్ తెలిపారు.

కాగా, నెల రోజుల వ్యవధిలో ముస్లిం మేధావులతో ఆర్ఎస్ఎస్ చీఫ్ సమావేశం కావడం ఇది రెండోసారి. అయితే గతంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్‌వై ఖురేషీ, ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పలువురు ముస్లిం మేధావులతో సమావేశం అయ్యారు. మత సామరస్యం, కమ్యూనిటీ విభేదాలు పరిష్కరించుకోవాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు.

వాళ్లు ఏం చేసినా కరెక్టే: అసదుద్దీన్

ఉన్నత వర్గాల వారు ఏం చేసినా కరెక్టేనని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ ముస్లిం మతపెద్దలతో సమావేశమవ్వడంపై ఓవైసీ స్పందించారు. ఈ సందర్భంగా ఓవైసీ మాట్లాడుతూ.. 'ముస్లిం సమాజంలోని ఉన్నత వర్గాలు ఏం చేసినా కరెక్టే. ఎందుకుంటే వారికి వారు జ్ఞానులుగా పరిగణించుకుంటారు. కింది స్థాయిలో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో తెలియదు. రాజకీయంగా పోరాడినప్పుడు ఎదురుదెబ్బలు తగులుతాయి. ఎలాంటి ఒత్తిడి లేకుండానే కొందరు ముస్లిం పెద్దలు ఆర్‌ఎస్ఎస్ చీఫ్ భేటీ అయ్యారు. వారికి ప్రజాస్వామ్య హక్కు ఉందని, ప్రశ్నించే హక్కు నాకు లేదు.' అని పేర్కొన్నారు.

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed