పాత పార్లమెంట్ భవనానికి పేరు పెట్టిన మోడీ.. వారందరికీ కీలక సూచన!

by Disha Web Desk 4 |
పాత పార్లమెంట్ భవనానికి పేరు పెట్టిన మోడీ.. వారందరికీ కీలక సూచన!
X

దిశ, తెలంగాణ బ్యూరో : స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 75 ఏండ్ల పాటు దేశ పార్లమెంట్‌గా ఉన్న భవనం ఇకపైన ‘సంవిధాన్ సదన్’గా మారనున్నది. వేలాది చట్టాలు చేసి దేశంలో అనేక మార్పులకు వేదికగా నిలిచిన పాత భవనం ప్రాధాన్యత, గొప్పదనం ఏ మాత్రం దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంపీల మీద ఉన్నదంటూ వ్యాఖ్యానించిన ప్రధాని మోడీ ఇకపైన దీన్ని కేవలం మ్యూజియంగా మాత్రమే కాక ‘సంవిధాన్ సదన్’గా పిల్చుకుందామని ప్రతిపాదించారు. ఇది కేవలం పాత భవనం మాత్రమే కాదని అనేక రాజ్యాంగ విధులకు వేదికగా నిలిచినందున దాని గౌరవాన్ని, ప్రతిష్టను కొనసాగించేలా కంటిన్యూ చేయాలని కోరారు.


Next Story

Most Viewed