సివిల్స్ అభ్యర్థులకు ఒక్క అవకాశమివ్వండి.. మోడీకి సీఎం లేఖ

by Dishanational4 |
సివిల్స్ అభ్యర్థులకు ఒక్క అవకాశమివ్వండి.. మోడీకి సీఎం లేఖ
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయలేకపోయిన అభ్యర్థులకు ఒక్క అవకాశం ఇవ్వాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు. ఈ మేరకు ప్రధానికి తమిళనాడు సీఎం లేఖ రాశారు. 'యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసే అభ్యర్థులు తరుఫున నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను.

కరోనా మహమ్మారి కారణంగా తమ చివరి ప్రయత్నాన్ని చేయలేకపోయిన అభ్యర్థులకు మరోసారి పరీక్ష రాసేందుకు వయసు సడలింపులు చేయండి' అని కోరారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా ఈ అభ్యర్థుల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. పలు పార్టీల నుంచి 150 మందికి పైగా ఎంపీలు కూడా దీనికి మద్దతు ఇచ్చారని చెప్పారు. కేంద్రం నిర్వహించే సాయుధ బలగాల పరీక్షల్లోనూ మూడేళ్ల వయోపరిమితి పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తమిళనాడు ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో రెండేళ్ల వయోపరిమితి పెంచిందని తెలిపారు.

Next Story

Most Viewed