మిథున్ చక్రవర్తి బెంగాల్‌కు చెందిన దేశద్రోహి: మమతా బెనర్జీ

by Disha Web Desk 17 |
మిథున్ చక్రవర్తి బెంగాల్‌కు చెందిన దేశద్రోహి: మమతా బెనర్జీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ నటుడు, రాజకీయవేత్త మిథున్ చక్రవర్తిపై గురువారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాయ్‌గంజ్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో టీఎంసీ చీఫ్ మమతా మాట్లాడుతూ, మిథున్ చక్రవర్తిని "బెంగాల్‌కు చెందిన పెద్ద ద్రోహి" అని మండిపడ్డారు. తన కుమారుడిని రక్షించడానికి RSS కార్యాలయంలో తల వంచాడని వ్యాఖ్యానించారు. నేను మిథున్ చక్రవర్తిని రాజ్యసభ ఎంపీని చేశాను, కానీ అతని కొడుకుని రక్షించడానికి బీజేపీకి మద్దతిచ్చారు, అతను దేశద్రోహి అని మమతా అన్నారు.

ఈ వ్యాఖ్యలపై చక్రవర్తి తీవ్రంగా స్పందించారు. బీజేపీకి క్రమంగా పెరుగుతున్న మద్దతుదారులను చూసి ముఖ్యమంత్రి ఆందోళన చెందుతున్నారు, ఆమె మతిస్థిమితం కోల్పోయింది, తాను దేశద్రోహిని కాదని, సైనికుడిని అని ఆయన అన్నారు. ఇంతకుముందు 2014లో, టీఎంసీ చక్రవర్తిని రాజ్యసభకు పంపింది, అయితే శారదా స్కామ్‌కు సంబంధించి ఆ గ్రూప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నందున అతని ప్రతిష్టను దెబ్బతీసింది. దర్యాప్తులో భాగంగా ఆయనను కూడా విచారించారు. 2016లో చక్రవర్తి అనారోగ్య కారణాలతో రాజ్యసభకు రాజీనామా చేశారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ర్యాలీలో చక్రవర్తి మార్చి 7, 2021న బీజేపీలో చేరారు.

Next Story