గత ఐదేళ్లలో రూ. 2 లక్షల కోట్ల సైనిక పరికరాలు దిగుమతి: రక్షణ శాఖ సహాయ మంత్రి

by Disha Web Desk 17 |
గత ఐదేళ్లలో రూ. 2 లక్షల కోట్ల సైనిక పరికరాలు దిగుమతి: రక్షణ శాఖ సహాయ మంత్రి
X

న్యూఢిల్లీ: గత ఐదేళ్లలో రూ.1.93 కోట్లు విలువ చేసే మిలిటరీ పరికరాలను భారత్ దిగుమతి చేసుకుంది. విషయాన్ని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ బట్ శుక్రవారం లోక్‌సభలో తెలిపారు. మంత్రి చెప్పిన వివరాల ప్రకారం హెలికాప్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్ రాడార్లు, రాకెట్లు, గన్స్, దాడికి ఉపయోగపడే రైఫిల్స్, మిసైల్స్, మందుగుండు సామాగ్రిని దిగుమతి చేసుకున్నారు. 2017-18 నుంచి 2021-22 వరకు రక్షణ సేవల ద్వారా సైనిక పరికరాలపై మంత్రి అందించిన డేటా ఇది.

రక్షణ సముపార్జన విధానం (డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్-డీఏపీ 2020) 'ఆత్మనిర్భర్ భారత్', మేక్ ఇన్ ఇండియాపై దృష్టి సారించి స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని పెంచడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి విధాన కార్యక్రమాలను ప్రవేశపెట్టామని భట్ చెప్పారు.

మంత్రి చెప్పిన వివరాల ప్రకారం విదేశాల నుంచి 2017-18లో రూ. 30,677.29 కోట్లు, 2018-19లో రూ. 38,115.60 కోట్లు, 2019-20 లో రూ. 40,330.02 కోట్ల సైనిక పరికరాలను దిగుమతి చేసుకున్నారు. అయితే 2020-21లో రూ. 43,916.37 కోట్లు ఖర్చుపెట్టిన ప్రభుత్వం దాన్ని 2021-22లో రూ. 40,839.53 కోట్లకు తగ్గించింది. మొత్తం మీద ఐదేళ్లలో 1 లక్ష 93 వేల 878.81 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.

'గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2017-18 నుండి 2021-2022 వరకు), ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2022-23 (డిసెంబర్ 2022 వరకు) రక్షణ పరికరాల కోసం మొత్తం 264 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మొత్తం ఒప్పందాల విలువలో 88 ఒప్పందాలలో 36.26 శాతంతో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, స్పెయిన్ దేశాలకు చెందిన వ్యాపారస్తులతో సంతకాలు జరిగాయి' అని మంత్రి అజయ్ బట్ తెలిపారు.


Next Story