టైర్ల గోదాములో భారీ అగ్నిప్రమాదం.. రహదారిపై కమ్ముకున్న దట్టమైన నల్లటి పొగ

by Ramesh Naini |

మహారాష్ట్రలోని థానే జిల్లా ముంబ్రా సమీపంలోని శిల్పటా ప్రాంతంలో ఉన్న ఓ టైర్ల గోదాములో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

టైర్ల గోదాములో భారీ అగ్నిప్రమాదం.. రహదారిపై కమ్ముకున్న దట్టమైన నల్లటి పొగ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలోని థానే జిల్లా ముంబ్రా సమీపంలోని శిల్పటా ప్రాంతంలో ఉన్న ఓ టైర్ల గోదాములో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భారీ సంఖ్యలో ఉన్న టైర్లకు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. రద్దీగా ఉండే రహదారి పక్కనే ఈ ప్రమాదం జరగడంతో కాసేపు ఆందోళన నెలకొంది.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే, అగ్నిప్రమాదానికి దారితీసిన కారణాలు ఇంకా తెలియరాలేదని, దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

Next Story