ప్లాస్టిక్ పైపుల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. 10 కి.మీ మేర పొగలు

by Gopi |
ప్లాస్టిక్ పైపుల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. 10 కి.మీ మేర పొగలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న ఓ ప్లాస్టిక్ పైపుల ఫ్యాక్టరీలో మంగళవారం మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పితంపూర్ పారిశ్రామిక ప్రాంతంలో ఉదయం ఏడు గంటలకు సెక్టార్ 3లోని సిగ్నెట్ పీవీసీ ప్యాక్టరీలో మంటలు ఏర్పడగా, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కర్మాగారంలో ప్లాస్టిక్ పైపులు తయారు చేస్తారు. దాంతో మంటల తీవ్రత అధికంగా ఉంది. భారీ సంఖ్యలో పైపుల నిల్వ కారణంగా 10 కిలోమీటర్ల వరకు పొగలు కమ్ముకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు 12కి పైగా ఫైర్ ఇంజన్లను అధికారులు ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఇసుక, నురగను ఉపయోగించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్యాక్టరీ లోపల ఉన్న కొన్ని ప్లాస్టిక్ పైపులను బయటకు తెచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దానివల్ల మంటలు మరింత వ్యాపించకుండా ఉంటాయి. సాధారణంగా ఈ ఫ్యాక్టరీలో ఉద్యోగులు ఉదయం 8 గంటల నుంచి పనిలోకి వస్తారు. ఉదయం ఏడు గంటలకే మంటలు చెలరేగడంతో ప్రమాద సమయంలో ఎవరికీ హానీ జరగలేదు.

Next Story

Most Viewed