2 సంవత్సరాల తర్వాత అమెరికాకు మామిడి పండ్ల ఎగుమతి

by Disha Web Desk 12 |
2 సంవత్సరాల తర్వాత అమెరికాకు మామిడి పండ్ల ఎగుమతి
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి కారణంగా యూఎస్ కు మామిడి పండ్ల ఎగుమతులను కేంద్రం నిలిపివేసింది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మామిడి పండ్ల ఎగుమతులను పునఃప్రారంభించింది. ఈ క్రమంలో ఇటీవల 1,000 టన్నుల అల్ఫోన్సో, కేసర్ రకాల మామిడి పండ్లను అమెరికాకు ఎగుమతి చేశారు. అయితే కరోనా సమయంలో రేడియేషన్ సౌకర్యాలను పరిశీలించడానికి US డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నుండి ఇన్‌స్పెక్టర్లు భారతదేశాన్ని సందర్శించలేకపోయినందున ఎగుమతులు రెండేళ్లపాటు నిలిపివేయబడ్డాయి. దీంతో భారత్ నుంచి యూఎస్‌కి ఎగుమతులు జరగలేదు.Next Story