ఎయిర్ హోస్టెస్‌పై వేధింపులు

by Disha Web Desk 17 |
ఎయిర్ హోస్టెస్‌పై వేధింపులు
X

చండీగఢ్: తాగిన మత్తులో ఓ ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్‌పై వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన దుబాయ్ నుంచి అమృత్‌సర్‌కు వస్తున్న ఓ విమానంలో తాజాగా చోటుచేసుకుంది. పంజాబ్‌లోని జలందర్ జిల్లా కోట్లీ గ్రామానికి చెందిన రాజిందర్ సింగ్ అనే వ్యక్తి, దుబాయ్ నుంచి వస్తుండగా, తాగిన మైకంలో ఏదో విషయమై ఎయిర్ హోస్టెస్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే ఆమెపై వేధింపులకూ పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు ఫిర్యాదు చేయగా, నిందితుడిని ‘శ్రీ గురు రాందాస్ జీ’ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు పంజాబ్ పోలీసులు వెల్లడించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, విచారణ చేపట్టామని తెలిపారు.

Next Story

Most Viewed