కేజ్రీవాల్‌‌కు మల్లిఖార్జున్ ఖర్గే ఫోన్.. దానికి కలిసి రావాలని పిలుపు

by Disha Web Desk 13 |
కేజ్రీవాల్‌‌కు మల్లిఖార్జున్ ఖర్గే ఫోన్.. దానికి కలిసి రావాలని పిలుపు
X

న్యూఢిల్లీ: దేశంలో ప్రతిపక్షాల పార్టీలను ఏకం చేసే కాంగ్రెస్ నిమగ్నమైంది. ఈ క్రమంలో శనివారం పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్‌తో టెలిఫోన్‌లో సంభాషణ చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాల ఐక్యత అవసరమని నొక్కి చెప్పినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. సీబీఐ విచారణకు హజరుకానున్న నేపథ్యంలో కేజ్రివాల్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు తెలిపాయి.

కాగా, శుక్రవారం లిక్కర్ స్కాంలో అవినీతి ఆరోపణలపై విచారణకు హజరు కావాలని కేజ్రివాల్‌కు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే పనిలో పడింది. దీనిలో భాగంగా బిహార్ సీఎం, జేడీయూ నేత నితీష్ కుమార్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో సమావేశమయ్యారు. నితీష్ కూడా కేజ్రివాల్‌తో నేరుగా సమావేశమై ప్రతిపక్షాల ఐక్యతకు మద్దతివ్వాలని కోరిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed