ఆ ఒక్క ప్రశ్నకు 7.5 కోట్లు.. కానీ, ఆమె కోటి రూపాయలే గెలుపొందారు?

by Disha Web Desk 22 |
ఆ ఒక్క ప్రశ్నకు 7.5 కోట్లు.. కానీ, ఆమె కోటి రూపాయలే గెలుపొందారు?
X

దిశ, వెబ్‌డెస్క్: కౌన్ బనేగా కరోడ్ పతి రియాలిటీ షో దేశవ్యాప్తంగా ఎంతటి పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ప్రముఖ దిగ్గజ సినీ నటుడు అమితాబ్ బచ్చన్ ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరించడంతో ఈ షో ప్రజల్లో మరింత ఆదరణ పొందింది. తాజాగా ఈ షో హిందీ వెర్షన్ కేబీసీ సీజన్-14 నడుస్తోదన్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఓ మహిల ఏకంగా 7.5 కోట్ల ప్రశ్న వరకు వెళ్లి నెటిజన్లను ఆకట్టుకుంది.

మహారాష్ట్ర కోల్హాపూర్‌కు చెందిన కవితా చావ్లా అనే మహిళ తన మొదటి ప్రశ్న నుంచే ఎంతో సమయస్ఫూర్తితో ఆడారు. ఈ క్రమంలో ఆమె 16 ప్రశ్నలకు సమాధానాలు చెప్పి కోటి రూపాయలు గెలుచుకున్నారు. అనంతరం 17వ ప్రశ్నకు సిద్ధమయ్యారు. అయితే, ఈ ప్రశ్నకు 7.5 కోట్లు. దీంతో కంటెస్టెంట్ కవితకు, హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అమితబ్‌కు, మిగతా ఆడియన్స్‌కు ఫుల్ టెన్సన్ మొదలైందనే చెప్పాలి. చివరిగా ఆ ప్రశ్న రానే వచ్చింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తొలి మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయుడు గుండప్ప విశ్వనాథ్ ఈ ఘనతను ఏ జట్టుపై సాధించాడు? అని వచ్చింది. దానికి ఆఫ్షన్స్.. a) సర్వీసెస్ b) ఆంధ్రా c) మహారాష్ట్ర d) సౌరాష్ట్ర. అయితే ఈ ప్రశ్నకు కవిత చాలాసేపు సమయం తీరుకున్నారు. ఎటువంటి లైఫ్ లైన్స్ కూడా లేవు. ఆమెకు కూడా ఈ ప్రశ్నపై కాస్త కన్‌ఫ్యూజన్ ఏర్పడింది. దాంతో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక పోటీ నుంచి క్విట్ అయిపోయారు. ఇక క్విట్ అయిపోయిన అనంతరం ఆమె A ఆప్షన్‌ను క్లిక్ చేశారు. కానీ, ఆ ప్రశ్నకు ఆన్సర్ B అవడంతో చాలామంది ఆమె క్విట్ అవడం సరైన ఆలోచన అని అనుకున్నారు. ఏది ఏమైనా ఎంతో తెలివితేటలతో ఆడిన ఆ మహిళ కోటి రూపాయలు గెలిచి ప్రేక్షకులతో పాటు అమితబ్ బచ్చన్ మెప్పును పొందారు.

Next Story