గవర్నర్ హద్దులు దాటారు.. ఆ వ్యాఖ్యలపై శరత్ పవర్ ఫైర్..

by Disha Web |
గవర్నర్ హద్దులు దాటారు.. ఆ వ్యాఖ్యలపై శరత్ పవర్ ఫైర్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్రపతి శివాజీపై ఇటీవల మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలోనే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్పందిస్తూ.. గవర్నర్ హద్దులు దాటుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారికి కీలకమైన పదవులు ఇవ్వకూడదని వ్యాఖ్యలు చేశారు. అనేక సందర్భాల్లో మహారాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఈ ప్రవర్తన పూర్తిగా ఆమోదయోగ్యం కాదని అన్నారు.

గవర్నర్ పదవి ఒక సంస్థకే ప్రాతినిధ్యం వహిస్తున్నారని అభిప్రాయపడ్డారు. కాగా, గవర్నర్ నిన్న మాత్రం శివాజీని ప్రశంసించడం, కీర్తించడం తను ఆలస్యంగా గ్రహించారని పేర్కొన్నారు. అంతేకాక ఇలాంటి వ్యాఖ్యలపై విచారణ జరిపి.. అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని, గవర్నర్ కార్యాలయం గౌరవాన్ని కాపాడేందుకు అవసరమైన మార్పును అమలు చేయాలని రాష్ట్రపతిని శరద్ పవార్ కోరారు. అయితే కోష్యారీ గత వారం ఔరంగాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత రోజులకే ఐకాన్ అని మాట్లాడటం వివాదస్పదంగా మారింది.

Next Story

Most Viewed