ఆరు సార్లు ఎమ్మెల్యే.. స్వతంత్రుడిగా బరిలోకి..

by Disha Web Desk 21 |
ఆరు సార్లు ఎమ్మెల్యే.. స్వతంత్రుడిగా బరిలోకి..
X

గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీకి తిరుగుబాటు తప్పట్లేదు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మధుబాయ్ శ్రీవాస్తవ్ ఈ సారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. చివరిసారిగా బీజేపీ తరుఫున వాఘోడియా స్థానం నుంచి గెలుపొందినప్పటికీ, ఈ సారి పార్టీ ఆయనకు టికెట్ కేటాయించలేదు. దీంతో స్వతంత్రుడిగానే బరిలోకి దిగేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 25 ఏళ్ల క్రితం మోడీ-షా హయాంలో బీజేపీలో చేరానని ఆయన చెప్పారు.

టికెట్ కేటాయించడంపై ఢిల్లీ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుందని, తానేమి చేయలేనని సీఎం భూపేంద్ర సింగ్ పటేల్ పేర్కొన్నారు. స్థానికంగా బాహుబలి అని పిలుచుకునే మధుబాయ్‌కి గుజరాత్ అల్లర్ల కేసులో ప్రమేయం ఉంది. కాగా, బీజేపీ తాజా ఎన్నికల్లో 38 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. వీరిలో మధుబాయ్ కూడా ఉన్నారు. 1995లోనూ స్వతంత్రుడిగా భారీ మెజార్టీతో గెలిచిన మధు మోడీ-షా ద్వయం పిలుపు మేరకు బీజేపీలో చేరానని చెప్పారు.

అయితే తన స్థానంలో పార్టీ టికెట్ పొందిన వడోదరా బీజేపీ చీఫ్ అశ్విన్ పటేల్ ఇచ్చింది. అయితే అశ్విన్ పటేల్ స్థానిక ఎన్నికల్లో కూడా విజయం సాధించలేదని మధుబాయ్ విమర్శించారు. బీజేపీ వైఖరి తనను నిరుత్సాహానికి గురి చేసిందని, వెంటనే పార్టీ అన్ని పదవుల నుంచి తప్పుకున్నానని తెలిపారు. ఇంకా ఇలాంటి నేతలు మరో ఐదుగురు ఉన్నారు. హిమచల్ ప్రదేశ్‌లోనూ బీజేపీకి రెబల్స్ బెడద ఎదురైన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed