- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Lucknow: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు
దిశ, వెబ్ డెస్క్: వీడీ సావర్కర్(VD Savarkar) పై రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యల పట్ల లక్నో కోర్టు(Lacknow Court) ఆయనకు సమన్లు(Summons) జారీ చేసింది. గత ఏడాది మహారాష్ట్రలో(Maharastra) జరిగిన భారత్ జోడో(Bharath Jodo) యాత్రలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంథీ వీడీ సావర్కర్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఉత్తరప్రదేశ్(UP) కు చెందిన న్యాయవాది నృపేంద్ర పాండే(Nrupendra Pande) పిటిషన్ దాఖలు చేశారు. సావర్కర్‌ను బ్రిటీష్ వారికి సహకరించిన వ్యక్తిగా రాహుల్ గాంధీ పేర్కొన్నారని, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశారని పాండే స్పష్టం చేశారు.
అంతేగాక మహాత్మా గాంధీ గతంలో సావర్కర్‌ను దేశభక్తుడిగా గుర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ముందుగా రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ను ఆశ్రయించగా.. ఈ పిటిషన్ ను ఏసీజేఎం అంబరీష్ కుమార్ శ్రీ వాస్తవ తోసిపుచ్చారు. దీంతో పాండే సెషన్స్ కోర్టులో సవాల్ చేశారు. ఈ ఫిర్యాదును విచారించిన లక్నో కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేస్తున్నట్లు తెలిపింది. కాగా భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాందీ.. సావర్కర్ ఒక బ్రిటిష్ సేవకుడని, అతను పెన్షన్ పొందాడని, సమాజంలో ద్వేషాన్ని, దుష్ప్రవర్తనను వ్యాపింపజేశాడని ఆరోపించారు.