కాంగ్రెస్ అధికారం కొనసాగితే రాష్ట్రానికి మరింత నష్టం: ప్రధాని మోడీ

by Harish |
కాంగ్రెస్ అధికారం కొనసాగితే రాష్ట్రానికి మరింత నష్టం: ప్రధాని మోడీ
X

కోటా: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం రాజస్థాన్‌లోని కోటాలో జరిగిన ర్యాలీలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలో కొనసాగితే రాష్ట్రానికి మరింత నష్టం కలిగిస్తుందని అన్నారు. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. నిషేధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) ర్యాలీకి పూర్తి పోలీసు రక్షణతో నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఎక్కువ కాలం అధికారంలో ఉంటే, రాజస్థాన్‌కు అంత నష్టం వాటిల్లుతుందన్నారు.

అంతేకాకుండా పేపర్ లీక్ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని మోడీ విమర్శలు చేశారు. పేపర్ లీక్ బాధ్యులను జైలుకు పంపుతామని, ఇది తన హామీ అన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు శిక్షణ కోసం కోటాకు వస్తుంటే వారి కలలను కాంగ్రెస్ నాశనం చేసింది. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వ కౌంట్‌డౌన్ ప్రారంభమైందన్నారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కనుమరుగవుతుందని పేర్కొన్నారు.Next Story

Most Viewed